నిలకడగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ముంబై,3 నవంబర్ (హి.స.)దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,990గా ఉంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర రూ.1,12,740 కాగా 18 క్యారెట్ 10 గ్ర
gold


ముంబై,3 నవంబర్ (హి.స.)దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,990గా ఉంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర రూ.1,12,740 కాగా 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.92,240గా నిలిచింది. హైదరాబాద్, విజయవాడలో పసిడి ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. మరోవైపు, దేశంలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,51,900గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడల్లో మాత్రం కిలో వెండి రూ.1,65,900 వద్ద తచ్చాడుతోంది (Gold Rates on Nov 3).

అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారం 24 క్యారెట్ ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర 4,002 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. అయితే, ధరలు 4,200 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక కారణాలు మినహా బంగారం ధర తగ్గడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని చెబుతున్నారు. బంగారానికి మౌలిక డిమాండ్ అలాగే ఉందని చెబుతున్నారు. మదుపర్లతో పాటు సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.

దేశంలో వివిధ నగరాల్లో ప్రస్తుతం పసిడి ధరలు ఇవీ

చెన్నై: ₹1,23,370; ₹1,13,090; ₹94,340

ముంబై: ₹1,22,990; ₹1,12,740; ₹92,240

ఢిల్లీ: ₹1,23,140; ₹1,12,890; ₹92,390

కోల్‌కతా: ₹1,22,990; ₹1,12,740; ₹92,240

బెంగళూరు: ₹1,22,990; ₹1,12,740; ₹92,240

హైదరాబాద్: ₹1,22,990; ₹1,12,740; ₹92,240

విజయవాడ: ₹1,22,990; ₹1,12,740; ₹92,240

కేరళ: ₹1,22,990; ₹1,12,740; ₹92,240

పూణె: ₹1,22,990; ₹1,12,740; ₹92,240

వడోదరా: ₹1,23,040; ₹1,12,790; ₹92,290

అహ్మదాబాద్: ₹1,23,040; ₹1,12,790; ₹92,290

కిలో వెండి ధరలు ఇలా

చెన్నై: ₹1,65,900

ముంబై: ₹1,51,900

ఢిల్లీ: ₹1,51,900

కోల్‌కతా: ₹1,51,900

బెంగళూరు: ₹1,51,900

హైదరాబాద్: ₹1,65,900

విజయవాడ: ₹1,65,900

కేరళ: ₹1,65,900

పూణె: ₹1,51,900

వడోదరా: ₹1,51,900

అహ్మదాబాద్: ₹1,51,900

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande