
అమరావతి, 11 డిసెంబర్ (హి.స.)బాలకృష్ణ కెరియర్ ను ఒకసారి పరిశీలన చేస్తే, ఏడాదిలో ఎక్కువ రోజులు సెట్స్ పై ఉండే హీరోగా కనిపిస్తారు. కథలు వినడం .. కరెక్షన్స్ చెప్పడం .. సెట్స్ పైకి వెళ్లిపోవడం .. ఆ సినిమాలను అదే స్పీడ్ తో థియేటర్స్ కి తీసుకురావడం మనకి కనిపిస్తుంది. ఎక్కడా నాన్చడం అలవాటు లేని హీరో ఆయన. ఇండస్ట్రీని సుదీర్ఘ కాలం పాటు ఏలుతున్న పూర్తి మాస్ హీరోగా బాలయ్యనే కనిపిస్తారు. బాలయ్య పేరుకు మించిన 'మాస్ మాత్రం' లేదనే విషయాన్ని ఆయన సినిమాల రికార్డులే చెబుతూ ఉంటాయి.
జానపద .. పౌరాణిక కథలను టచ్ చేసి సక్సెస్ అయిన బాలయ్య, మాస్ ప్రేక్షకులను రంజింపజేయడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వెళ్లారు. సినిమాకి .. సినిమాకి మధ్య పెద్దగా గ్యాప్ ఇవ్వడం అలవాటు లేని బాలకృష్ణ, మొదటి నుంచి కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నారు. అదే ఎనర్జీతో ఆయన చేసిన 'అఖండ 2' రేపు థియేటర్లలో దిగిపోనుంది. భారీ బడ్జెట్ లో .. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. కథాకథనాలు .. యాక్షన్ దృశ్యాలు .. డివోషనల్ టచ్ .. సంగీతం ఈ సినిమా హైలైట్స్ గా నిలవనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV