'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స) మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా నుండి మరో కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, మూవీ మేకర్స్ ''మన శంకర వరప్రసాద్ గారు'' నుంచి సెకండ్ సింగిల్ శశిరేఖ సాంగ్ విడుదల చేశారు. దీనిని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సి
మన శంకర వరప్రసాద్ గారు


హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స) మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా నుండి మరో కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, మూవీ మేకర్స్ 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి సెకండ్ సింగిల్ శశిరేఖ సాంగ్ విడుదల చేశారు.

దీనిని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సింగర్ మధు ప్రియ పాడారు. కొద్ది సేపటి క్రితం విడుదలైన ఈ పాట వ్యూస్ రాబడుతున్నప్పటికీ నెటిజన్ల చేత విమర్శలు వస్తున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కొట్టి పారేస్తున్నారు. ఇక మొదటి సాంగ్ మెప్పించినంతగా.. రాబట్టుకునేలా సెకండ్ సింగిల్ వ్యూస్ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande