ఏడవసారి ఫిల్మ్ పేర్ అవార్డు అందుకుని మెగాస్టార్ సరసన నిలిచిన బన్నీ..
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
అల్లు అర్జున్


హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన

వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం సినీ పరిశ్రమకు సంబంధించిన వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు.

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది హీరోలకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక సార్లు ఈ అవార్డును అందుకున్న వారిలో చిరంజీవి, అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇన్ని రోజుల పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులను అత్యధిక సార్లు దక్కించుకున్న హీరోల లిస్టులో చిరంజీవితో పోలిస్తే అల్లు అర్జున్ వెనకబడ్డాడు. కానీ తాజాగా బన్నీకి పుష్ప పార్ట్ 1 మూవీలోని నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది.

దానితో అత్యధిక సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న తెలుగు హీరోలలో ఈ ఇద్దరు సమాన స్థానాలలో నిలిచారు. ఇప్పటివరకు చిరంజీవి ఫిల్మ్ ఫేర్ అవార్డులలో 21 సార్లు నామినేట్ కాగా, ఏడు సార్లు అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ 13 సార్లు నామినేట్ కాగా ఏడు సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇలా ఈ ఇద్దరు నటులు ఇప్పటికీ చెరో ఏడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకొని సమాన స్థాయిలో నిలిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande