
డర్బన్ 14 డిసెంబర్ (హి.స.)
సౌతాఫ్రికా క్వాజులు- నటాల్ ప్రావిన్స్లోని నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల న్యూ అహోబిలం ఆలయం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఆలయం డర్బన్ నగరానికి ఉత్తరాన రెడ్ క్లిఫ్ ప్రాంతంలోని వేరులం సమీపంలో ఉంది. నిర్మాణ సమయంలో భవనం ఒక భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
మరణించిన వారిలో భారత సంతతి వ్యక్తి జయరాజ్ పాండే ఉన్నారు. ఆయన న్యూ అహోబిలం ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, ఆలయ నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజర్ కొనసాగుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు