ఎలాన్ మస్క్ కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య బహిరంగ లేఖ
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.) పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెనీమా గోల్డ్ స్మిత్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ క్కు బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ సరిచేయాలని కోరారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గ
ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య


హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ

భార్య జెనీమా గోల్డ్ స్మిత్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ క్కు బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ సరిచేయాలని కోరారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని వెల్లడించారు. తాను ఇమ్రాన్ ఖాన్ గురించి పెడుతున్న పోస్టులను ఎక్స్ వేదికగా అణచివేస్తున్నారని ఆరోపించారు. వాక్ స్వాతంత్య్రం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఎవరూ వినని వాక్ స్వాతంత్య్రం కాదు కదా అని ప్రశ్నించారు.

కనీసం తన కుమారులు కూడా ఆయనను కలిసేందుకు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ప్రాథమిక మానవ హక్కుల లేని ఒక రాజకీయ ఖైదీ అని ప్రపంచానికి చెప్పడానికి తనకు ఎక్స్ మాత్రమే మిగిలి ఉందని జమీమా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దానికి కూడా రీచ్ సున్నా అని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande