హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, అతని భార్య అనుమానాస్పద మృతి
లాస్ ఏంజెలెస్ 15 డిసెంబర్ (హి.స.) ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ రాబ్ రీనర్, అతని భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ షాకింగ్ సంఘటన లాస్ (Los Angeles) లోని దర్శకుడు రాబ్ రీనర్ (Rob Reiner) నివాసంలో చోటు చేసుకుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, వారి
హాలీవుడ్లో విషాదం


లాస్ ఏంజెలెస్ 15 డిసెంబర్ (హి.స.)

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ రాబ్ రీనర్, అతని భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ షాకింగ్ సంఘటన లాస్ (Los Angeles) లోని దర్శకుడు రాబ్ రీనర్ (Rob Reiner) నివాసంలో చోటు చేసుకుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, వారి శరీరాలపై కత్తిగాయాలు కనిపించాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై, దీనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3:30 కి ఘటన వెలుగు చూసింది. రాబ్ రీనర్ మరణంతో హాలీవుడ్కు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆయన గత ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించారు. ఆయన నటించిన సపోర్టింగ్ క్యారెక్టర్లకు గాను రెండు ఎమ్మీ అవార్డులు (Emmy Awards) కూడా అందుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande