ఎన్ని జన్మలెత్తినా తమిళనాడులో బిజెపి గెలవలేదు: సీఎం స్టాలిన్
తమిళనాడు, 15 డిసెంబర్ (హి.స.) తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ బీజేపీ, కేంద్ర మంత్రి అమిత్ షా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా తమిళనాడులో అధికారంలోకి రాలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనుకొగానే బీజేపీ అధికార
స్టాలిన్


తమిళనాడు, 15 డిసెంబర్ (హి.స.)

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే

అధినేత ఎం.కె. స్టాలిన్ బీజేపీ, కేంద్ర మంత్రి అమిత్ షా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా తమిళనాడులో అధికారంలోకి రాలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనుకొగానే బీజేపీ అధికారంలోకి రావడానికి ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అని స్టాలిన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేవలం అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వfచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు అని స్టాలిన్ హెచ్చరించారు. -------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande