
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
ఐపీఎల్ (IPL) 2026 కోసం
అబుదాబీ వేదికగా మినీ వేలం ప్రారంభం అయింది. కాగా ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ హాట్ కేక్గా మారాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో వేలానికి వచ్చిన గ్రీన్ను కోల్కతా నైటైడర్స్ ఏకంగా రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సాధించాడు. అదే తొలి సెట్లో డేవిడ్ మిల్లర్ను దిల్లీ క్యాపిటల్స్ అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే దక్కించుకుంది. అయితే పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రెజర్ మెక్బుర్పై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఐపీఎల్ (IPL) 2026 మార్చ్ 26 నుంచి మొదలు కానున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు