
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఇరుదేశాల మధ్య ఆదివారం సాయంత్రం ధర్మశాల క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. మ్యాచ్ సమయంలో చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం, హిమపాతం కురిసే అవకాశాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. శనివారం సాయంత్రం, మనాలి-లేహ్ మార్గంలోని బరాలాచా-షింకులా పాస్లతో సహా ఎత్తయిన శిఖరాలపై మంచు కురిసింది. రాజధాని సిమ్లాతో సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు రోజంతా మేఘావృతమై ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. శనివారం ఉదయం, సాయంత్రం బిలాస్పూర్, మండి జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. ఆదివారం కోసం ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యింది. సిమ్లాలోని వాతావరణ కేంద్రం ప్రకారం.. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా ఆదివారం లాహౌల్-స్పితి, చంబా, కులు, కాంగ్రాలోని ధౌలాధర్ ప్రాంతాల్లో హిమపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు