పొగమంచు గుప్పిట్లో దిల్లీ
ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.): దేశ రాజధాని దిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలూ కనిపించని పరిస్థితి ఎదురవడంతో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 6 గంటల సమయంలో రాజధానిని పొగమ
Delhi Air Pollution


ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.): దేశ రాజధాని దిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలూ కనిపించని పరిస్థితి ఎదురవడంతో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 6 గంటల సమయంలో రాజధానిని పొగమంచు కప్పేసినట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 100 మీటర్లకుపైగా దూరం ఉన్న వాహనాలూ కనిపించని పరిస్థితి ఎదురైందని తెలిపింది. పొగమంచు కారణంగా 27 విమానాలు రద్దుకాగా.. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. గురువారం దిల్లీలో వాయు నాణ్యత (ఏక్యూఐ) 373గా నమోదైంది. మరోవైపు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande