విద్వేష ప్రసంగ వ్యతిరేక బిల్లు ఆమోదించిన కర్ణాటక అసెంబ్లీ
బెళగావి:/ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.) దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకు వచ్చిన విద్వేష ప్రసంగ వ్యతిరేక బిల్లును కర్ణాటక అసెంబ్లీ గురువారం ఆమోదించింది. బీజేపీ సభ్యుల తీవ్ర నిరసనల మధ్య సభ ‘ది హేట్‌ స్పీచ్‌ అండ్‌ హేట్‌ క్రైమ్స్‌ (ప్రివెన్షన్‌)బిల్లు’కు
Siddaramaiah


బెళగావి:/ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.) దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకు వచ్చిన విద్వేష ప్రసంగ వ్యతిరేక బిల్లును కర్ణాటక అసెంబ్లీ గురువారం ఆమోదించింది. బీజేపీ సభ్యుల తీవ్ర నిరసనల మధ్య సభ ‘ది హేట్‌ స్పీచ్‌ అండ్‌ హేట్‌ క్రైమ్స్‌ (ప్రివెన్షన్‌)బిల్లు’కు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం..విద్వేష ప్రసంగాలు, నేరాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్‌ ఆమోదం తెలపగా, ఈ నెల 10వ తేదీన అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఈ బిల్లు ప్రకారం, బతికున్న/ మరణించిన వ్యక్తి, వ్యక్తుల సమూహం, వర్గం/ సమాజంపై ఏదైనా ప్రతికూల ప్రయోజనాన్ని ఆశించి... హాని, అశాంతి, శత్రుత్వం, ద్వేషం కలిగించాలనే ఉద్దేశంతో, బహిరంగంగా, మాటల ద్వారా రాతపూర్వకంగా, సైగలు దృశ్య రూపాల ద్వారా, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా లేదా మరే ఇతర మార్గంలోనైనా చేసే ప్రకటనలు లేదా వ్యక్తీకరణలు ద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande