
ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.) ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హై-ఎండ్ స్పోర్ట్స్కార్లతో నిండిన గ్యారేజ్ చూసి ఈడీ అధికారులే నివ్వెర పోయారు. లంబోర్గిని ఉరుస్, BMW Z4, మెర్సిడెస్-బెంజ్‌తో సహా నాలుగు హై-ఎండ్ కార్లు వీటిల్లో ఉన్నాయి.
బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలు మరియు డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు సంస్థకు చెందిన 16 మంది సభ్యుల బృందం బుధవారం నవాబ్‌గంజ్, ఉన్నావ్ మరియు లక్నోలోని అనురాగ్ ప్రాంగణాలపై దాడి చేసింది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ద్వివేది బెట్టింగ్, జూదం యాప్‌లను ప్రమోట్ చేశాడు. ఫలితంగా ఎంతో అమాయకులు ఈ యాప్‌లలో చేరారని, దీంతో చట్టవిరుద్ధ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించారని ఈడీ తెలిపింది. భారతదేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా ద్వివేది సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం స్కై ఎక్స్ఛేంజ్, ఇతర యాప్‌ల నుండి వచ్చాయట. ఇలా వచ్చిన ఆదాయాన్ని వివిధ మార్గాల ద్వారా లాండరింగ్ చేసి, ఆపై లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారని ఈడీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ