
ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.) తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన లోక్‌పాల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్ అనిల్ క్షేతర్‌పాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. లోక్‌పాల్ మళ్లీ ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. లోక్‌పాల్ అండ్ లోకాయుక్తాస్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సంబంధిత నిబంధనలను అనుసరించి, నెల రోజుల్లో అనుమతి అంశంపై తాజా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
అయితే, ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హిరానందానీ నుంచి నగదు, బహుమతులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు మహువా మొయిత్రాపై ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ