లోక్‌ సభ నిరవధిక వాయిదా
ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.) : కాలుష్యంపై చర్చించకుడానే లోక్‌ సభ నిరవధిక వాయిదా పడింది. నిన్న వీబీ జీ-రామ్‌-జీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇవాళ కూడా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. వీబీ జీ-రామ్‌-జీ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ పార్లమెం
Lok Sabha


ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.) : కాలుష్యంపై చర్చించకుడానే లోక్‌ సభ నిరవధిక వాయిదా పడింది. నిన్న వీబీ జీ-రామ్‌-జీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇవాళ కూడా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. వీబీ జీ-రామ్‌-జీ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో మహాత్మా గాంధీ ఫొటోలతో విపక్షాల నిరసనకు దిగాయి. రాత్రంత సంవిధాన్‌ సదన్‌ ముందు తృణమూల్‌ ఎంపీలు నిరసనలు తెలిపారు.

తెల్లవారుజాము దాకా అక్కడే ఉండి ఎంపీలు నిరసనలు తెలిపారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవికా మిషన్‌–గ్రామీణ(జీ రామ్‌ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande