బిహార్ సీఎంకు భద్రత పెంపు
పాట్నా, 19 డిసెంబర్ (హి.స.)బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఇటీవల సీఎం నితీష్ కుమార్ పాట్నాలో ఆయుష్‌ డాక్టర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఓ మహిళా డాక్టర్‌ హిజాబ్‌ను లాగిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర
నితీష్


పాట్నా, 19 డిసెంబర్ (హి.స.)బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఇటీవల సీఎం నితీష్ కుమార్ పాట్నాలో ఆయుష్‌ డాక్టర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఓ మహిళా డాక్టర్‌ హిజాబ్‌ను లాగిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షహ్జాద్‌ భట్టి వీడియో ద్వారా బెదిరించాడు. దీంతో ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల సమాచారం ఆధారంగా మరింత భద్రతను పెంచారు.

స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(SSG)ను బలోపేతం చేయగా.. నితీష్ నివాసం, కార్యాలయం వద్ద SSB కార్డన్‌ను మోహరించారు. ఇక అదనపు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులకు అలర్ట్ జారీ చేసి, సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తతతో పాటు సోషల్ మీడియా మానిటరింగ్ పెంచాలని ఆదేశించారు. అయితే సీఎం హిజాబ్ లాగడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా.. NDA నేతలు నితీష్ చేసింది సరైనదేనని అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande