జీ రామ్ జీ బిల్లు... రాత్రంతా పార్లమెంట్ మెట్ల మీద నిద్రించిన TMC ఎంపీలు
ఢిల్లీ, 19 డిసెంబర్ (హి.స.)పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గురువారం విక్సిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ బిల్- 2025 (VB-G RAM G బిల్లు లేదా జీ రామ్ జీ బిల్లు) ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును విపక్షాలతోపాటు బెంగాల
/tmc-mps-slept-on-the-steps-of-parliament


ఢిల్లీ, 19 డిసెంబర్ (హి.స.)పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గురువారం విక్సిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ బిల్- 2025 (VB-G RAM G బిల్లు లేదా జీ రామ్ జీ బిల్లు) ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును విపక్షాలతోపాటు బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)కు బదులుగా తీసుకొచ్చిన ఈ చట్టంలో గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ అందించడం, కేంద్ర-రాష్ట్రాల నిధుల భాగస్వామ్యాన్ని 60:౪౦ కు పెంచడం వంటి మార్పులు ఉన్నాయి. అయితే ఈ మార్పును పేదల ఉపాధి పథకాల ఆధునికీకరణగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుండగా.. విపక్షాలు మాత్రం గాంధీ పేరు తొలగింపు, రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపడం, గ్రామీణ పేదలకు నష్టం చేకూర్చడమే అంటూ విమర్శిస్తున్నాయి.

బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సగరికా ఘోష్‌, డెరెక్ ఓ’బ్రియన్‌, డోలా సేన్‌, సుస్మితా దేవ్‌లతో పాటు ఇతర విపక్షాలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని సంవిధాన్ సదన్ మెట్లపై గురువారం రాత్రంతా దాదాపు 12 గంటల పాటు తీవ్ర చలిలో ధర్నా చేపట్టారు. MGNREGAను చంపొద్దు, మహాత్మాను రెండోసారి హత్య చేశారు అనే ప్లకార్డులతో రాత్రంతా నిరసన వ్యక్తం చేసారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande