
ముంబై, 20 డిసెంబర్ (హి.స.)
గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ
మార్కెట్లో ఒత్తిడిని ఎదుర్కొన్న భారత రూపాయి, ఎట్టకేలకు తిరిగి పుంజుకుంది. అమెరికన్ డాలర్ విలువ స్వల్పంగా బలహీనపడటం, దేశీయ మార్కెట్లలోకి పెట్టుబడులు తిరిగి రావడంతో రూపాయి మారకం విలువ ఒక్క రోజే 97 పైసలు బలపడింది. దీనితో ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 89.27 వద్ద కొనసాగుతోంది. ఈ రికవరీ ఎగుమతిదారులు, దిగుమతి దారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు