
ముంబై, 20 డిసెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఎంత తగ్గినా.. మళ్లీ మరుసటి రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు డెబ్బై, ఎనబై వేల రూపాయల వద్ద ఉండే బంగారం ధరలు.. ఇప్పుడు రెట్టింపు ధరతో ట్రేడవుతున్నాయి. ఇటీవల తులం ధర లక్షా 20 వేలకు దిగువన ఉండగా, ఇప్పుడు లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా డిసెంబర్ 20న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూన.1,22,990 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,08,900 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే ఇంకా భారీగా ఉంది. రూ.2,20,900 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు!
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,320ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,23,140 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV