
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
2026 ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్
కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్ గా మరోసారి అక్షర్ పటేల్ కు అవకాశం దక్కింది. దీంతో శుభ్ మాన్ గిల్కు ఉహించని షాక్ తగిలింది. అలాగే చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు జట్టులో చోటు దక్కింది. మొత్తంగా సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్త్రీత్ బూమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషన్ కిషన్ లకు జట్టులో చోటు దక్కింది. అలాగే గాయాలతో బాదపడుతున్న గిల్, యశస్వీ జైస్వాల్ లకు జట్టులో స్థానం దక్కలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు