
ముంబై, 22 డిసెంబర్ (హి.స.)బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తోన్న గోల్డ్ రేట్లు సోమవారం స్వల్ప తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల్లో బంగారం ధరలు పెరగడంతో అలాగే కొనసాగుతాయని అందరూ ఊహించారు. కానీ ఈ వారంలో తొలిరోజే గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. స్వల్పంగా బంగారం ధర తగ్గడంతో అందరూ ఊరట చెందుతున్నారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,170గా ఉంది. నిన్న ఇదే ధర రూ.1,34,180 వద్ద కొనసాగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ రూ.1,22,990 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే ధర రూ.1,23,000గా ఉంది.
-ఇక విజయవాడలో సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,170 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే ధర రూ.1,34,180గా ఉంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,22,990గా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,35,270 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,990గా ఉంది.
-
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV