
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
గత కొంతకాలంగా వరుస పతనాలతో
ఆందోళన కలిగించిన భారత రూపాయి విలువ, మంగళవారం ట్రేడింగ్ నెమ్మదిగా కోలుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడటం, దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం రూపాయికి కలిసొచ్చింది. నేడు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు పుంజుకుని 89.65 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. చమురు కంపెనీల నుంచి డాలర్కు డిమాండ్ స్వల్పంగా తగ్గడం కూడా రూపాయి రికవరీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు