ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే
ముంబై, 23 డిసెంబర్ (హి.స.) బంగారం ధరలు సోమవారం నుంచి భారీగా పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా వేలకు వేలు పెరుగతూ కొనుగోలు చేసేవారికి షాక్ ఇస్తున్నాయి. సోమవారం రూ.వెయ్యి వరకు పెరిగిన గోల్డ్ రేటు.. మంగళవారం ఏక
Gold


ముంబై, 23 డిసెంబర్ (హి.స.)

బంగారం ధరలు సోమవారం నుంచి భారీగా పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా వేలకు వేలు పెరుగతూ కొనుగోలు చేసేవారికి షాక్ ఇస్తున్నాయి. సోమవారం రూ.వెయ్యి వరకు పెరిగిన గోల్డ్ రేటు.. మంగళవారం ఏకంగా రూ.2400 పెరిగింది. తులం బంగారం రూ.లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రూ.1,38,550గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,36,150గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.2400 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,27,000గా వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,24,800గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.2200 పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande