
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
హిందీ బిగ్ బాస్ 19 విజేత ఎవరు అనే
ఉత్కంఠకు తెర పడింది. బిగ్ బాస్-19 వ ట్రోఫీని టీవీ నటుడు గౌరవ్ ఖన్నా గెలుచుకున్నాడు. దీంతో అతనికి ప్రైజ్ మనీగా రూ.50 లక్షలు దక్కాయి. మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్న ఫర్హానా భట్ రన్నరప్గా నిలిచారు. బిగ్బాస్ పోస్ట్ సల్మాన్ ఖాన్ వీరిద్దరిని ఫైనలిస్టులుగా ప్రకటించి, చివరి అంకం తర్వాత గౌరవ్ ఖన్నా చేతిని పైకి ఎత్తి, విజేతగా ప్రకటించారు. బిగ్ బాస్ 19 టైటిల్ గెలిచిన తర్వాత అతను మీడియాతో మాట్లాడారు. హౌస్లోకి వెళ్లినట్లే తాను బయటకు వచ్చానని, ప్రేక్షకులు ఆ విషయాన్ని మెచ్చుకోవడం తనకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. వంద శాతం కృషి చేయడం నా జీవిత లక్ష్యం అని చెబుతూ, తాను బిగ్ బాస్ హౌస్లో కూడా అదే సూత్రాన్ని పాటించానని పరోక్షంగా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు