బెంగుళూరు. 5 మార్చి (హి.స.)
కర్నాటక లో దారుణం జరిగింది. ఓ అమ్మాయి తనతో పెళ్లికి అంగీకరించలేదని, ఆ ఉన్మాది ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెల్గావిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నాథ్ పాయి సర్కిల్ వద్ద 20 ఏళ్ల ఐశ్వర్య మహేహ్ లోహర్ అనే అమ్మాయిని.. 29 ఏళ్ల ప్రశాంత్ కుందేకర్ హత్య చేశాడు.
ఐశ్వర్యను ఏడాది కాలం నుంచి ప్రశాంత్ ప్రేమిస్తున్నాడు. పెయింటర్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి.. గతంలో ఓ సారి ఐశ్వర్య తల్లి వద్ద పెళ్లి గురించి ప్రస్తావించాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆర్థికంగా స్థిరపడాలని బాధితురాలి తల్లి నిందితుడికి హితబోధ చేసింది. ఐశ్వర్య పిన్ని ఇంటికి విషం బాటిల్తో వెళ్లిన ప్రశాంత్.. పెళ్లి చేసుకోవాలని ఆమెను వత్తిడి చేశారు. ప్రశాంత్ అభ్యర్థనను ఆమె తిరస్కరించింది. విషం తాగేలా ఐశ్వర్యను వత్తిడి చేశాడు. కానీ ఆమె అడ్డుకున్నది. ఆ సమయంలో తన జేబులో ఉన్న కత్తిని తీసి.. ఐశ్వర్య గొంతు కోశాడు ప్రశాంత్.
విపరీతంగా రక్త స్రావం కావడంతో ఐశ్వర్య మృతిచెందినట్లు తేల్చారు. ఆ తర్వాత అదే కత్తితో.. తన గొంతు కోసుకున్న ప్రశాంత్.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..