తుంగభద్ర నదిలో హైదరాబాద్ యువ వైద్యురాలి గల్లంతు
గంగావతి, 20 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యురాలు తుంగభద్రలో గల్లంతైన సంఘటన సణాపుర వద్ద బుధవారం ఉదయం జరిగింది. గల్లంతైన యువతిని మైనంపల్లిఅనన్య రావ్‌(26)గా గుర్తించారు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె హంపి పర్యటనకు వచ్చారు, స్మారకాలను
తుంగభద్ర నదిలో హైదరాబాద్ యువ వైద్యురాలి గల్లంతు


గంగావతి, 20 ఫిబ్రవరి (హి.స.)

హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యురాలు తుంగభద్రలో గల్లంతైన సంఘటన సణాపుర వద్ద బుధవారం ఉదయం జరిగింది. గల్లంతైన యువతిని మైనంపల్లిఅనన్య రావ్‌(26)గా గుర్తించారు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె హంపి పర్యటనకు వచ్చారు, స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం ఉదయం ఈతకు వెళ్లి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటార]ని పోలీసులు అనుమానిస్తున్నారు. గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా యువ వైద్యురాలి జాడ కనిపించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సాయం కోరనున్నట్లు సీఐ సోమశేఖర్‌ జుట్టల తెలిపారు. డీవైఎస్పీ సిద్ధలింగనగౌడ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande