న్యూఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.)
: లేడీ డాన్ జోయా ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె వద్ద నుంచి కోటి రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర గ్యాంగ్స్టర్ హషిమ్ బాబా భార్యే జోయా ఖాన్. ఆమె వద్ద ఉన్న సుమారు 270 గ్రాముల హెరాయిన్ను పోలీసులు పట్టుకున్నారు. అంర్జాతీయ మార్కెట్లో దాని విలువ కోటి ఉంది. జోయా వయసు 33 ఏళ్లు. భర్త హషిమ్ బాబా జైలులో ఉన్నా... అతనికి ఉన్న లింకులతోనే జోయా ఖాన్ అక్రమ కార్యకలాపాలు సాగించింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్