తెలంగాణ, మిర్యాలగూడ. 6 మార్చి (హి.స.)
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని జామాయిల్ చెట్టుకు గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీ షర్ట్ ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు రూరల్ పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్