ఝార్ఖండ్ లో ఎన్ కౌంట‌ర్ – అయిదు ల‌క్ష‌ల రివార్డ్ న‌క్స‌లైట్ హ‌తం
జార్ఖండ్, 26 మే (హి.స.) ఝార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో కీలక నక్సలైట్ ఒకరు మరణించారు. మరో నక్సలైట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించ
Encounter


జార్ఖండ్, 26 మే (హి.స.)

ఝార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో కీలక నక్సలైట్ ఒకరు మరణించారు. మరో నక్సలైట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు లాతేహార్ పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో రూ.5 లక్షల రివార్డు ఉన్న మనీశ్ యాదవ్ అనే నక్సలైట్ మరణించినట్టు పలామూ డీఐజీ వైఎస్ రమేశ్ ధ్రువీకరించారు. మనీశ్ యాదవ్ చాలా కాలంగా పలు హింసాత్మక ఘటనల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.ఈ ఆపరేషన్‌లో భాగంగా తలపై రూ. 10 లక్షల రివార్డు ఉన్న కుందన్ ఖేర్వార్ అనే మరో నక్సలైట్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రెండు అత్యాధునిక ఎక్స్ 95 ఆటోమేటిక్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande