ఐపీఎల్ లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్-2 టార్గెట్!
జైపూర్, 26 మే (హి.స.) ఐపీఎల్ 2025లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి.
ఐపీఎల్


జైపూర్, 26 మే (హి.స.)

ఐపీఎల్ 2025లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి. ప్రస్తుతం 13 మ్యాచ్లో 8 విజయాలతో పట్టికలో 17 పాయింట్లతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. ముంబై 13 మ్యాచ్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టుకు టాప్-2లో స్థానం ఖరారు అవుతుంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande