
హైదరాబాద్, 31 మే (హి.స.)
మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు.. జూన్ 10 వ తేదిన దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని కోరుతూ మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖను విడుదల చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు.. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడంలేదని విమర్శించారు.. రెండు నెలలుగా సంయమనం పాటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు.. కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా బంద్ కు పిలుపు ఇస్తునట్లు చెప్పారు.. అలాగే జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తునట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..