అరుణాచల యాత్రకు ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. వివరాలు ఇవిగో!
అరుణాచలం, 10 జూన్ (హి.స.)తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం దర్శించుకోవాలని చూస్తున్న భక్తుల కోసం ఇండియన్ రైల్వే శాఖ స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ఐఆర్ సీటీసీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ లో కాంచ
అరుణాచల యాత్రకు ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. వివరాలు ఇవిగో!


అరుణాచలం, 10 జూన్ (హి.స.)తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం దర్శించుకోవాలని చూస్తున్న భక్తుల కోసం ఇండియన్ రైల్వే శాఖ స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ఐఆర్ సీటీసీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ లో కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దర్శనంతో పాటు పుదుచ్చేరిలోని పకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. ప్రతీ గురువారం కాచిగూడ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుందని, 4 రాత్రులు, 5 పగళ్లు యాత్ర కొనసాగుతుందని వెల్లడించింది. జూన్‌ 19 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande