యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌..
అమరావతి, 12 జూన్ (హి.స.) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్‌ 11) రాత్రి విడుదలైనాయి. ప్రిలిమ్స్ పరీక్షకు 2025కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వి
యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌..


అమరావతి, 12 జూన్ (హి.స.) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్‌ 11) రాత్రి విడుదలైనాయి. ప్రిలిమ్స్ పరీక్షకు 2025కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యేటా యూపీఎస్సీ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి ప్రిలిమినరీ పరీక్షను దేశవ్యాప్తంగా మే 25న యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్‌ నంబర్లతో కూడిన జాబితాను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్‌ మార్కులు, ఆన్షర్‌ కీ వంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో కమిషన్‌ అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ప్రిలిమ్స్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకాగా.. వారిలో 14,161 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కి అర్హత సాధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande