నాగార్జునసాగర్ డ్యాం కొనసాగుతున్న వార్షిక మరమ్మతులు
నల్గొండ, 13 జూన్ (హి.స.) నాగార్జునసాగర్ డ్యామ్కు ప్రతి ఏటా చేపట్టవలసిన మరమ్మతుల పనులను డ్యామ్ ఎన్ఎస్పీ సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేయగా, డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ట్ర
సాగర్ డ్యాం


నల్గొండ, 13 జూన్ (హి.స.)

నాగార్జునసాగర్ డ్యామ్కు ప్రతి ఏటా చేపట్టవలసిన మరమ్మతుల పనులను డ్యామ్ ఎన్ఎస్పీ సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేయగా, డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ట్రయల్ రన్ నిర్వహిస్తు గేట్ల రోప్లకు గ్రీసింగ్ పనులను చేపడుతున్నారు. మరో వారం రోజుల్లో డ్యామ్ క్రస్ట్ గేట్ల మరమ్మతుల పనులు పూర్తి కానున్నట్లు సిబ్బంది తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడం, శ్రీశైలం ఎగువన ఉన్న రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్లోకి నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో పనులను త్వరతగతిన పూర్తి చేస్తున్నారు.

నాగార్జునసాగర్ డ్యామ్ ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. డ్యామ్ 26 క్రస్ట్ గేట్ల వార్షిక మరమ్మతుల పనులను మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. డ్యామ్ గ్యాలరీలో క్లీనింగ్, లైటింగ్ పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande