
బెంగళూరు, 17 జూన్ (హి.స.)కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar) సైకిల్ దిగుతుండగా కింద పడిపోయాడు.
ఈ షాకింగ్ ఘటన మంగళవారం ఉదయం బెంగళూరులోని విధాన సౌధ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా జరిగిన ఈకో వాక్ (Eco Walk) కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సైకిల్ తొక్కిన శివకుమార్, సైకిల్ నుంచి దిగుతుండగా అదుపుతప్పి.. ఒక్కసారిగా మెట్లపై పడిపోయారు. కాగా ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో డీకే శివకుమార్ సైకిల్ దిగే సమయంలో కాలు తడబడి పడిపోయినట్లు స్పష్టంగా కనిపించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి