టెహ్రాన్‌ను తక్షణమే వీడండి: భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
టెహ్రాన్‌: , 17 జూన్ (హి.స.)ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న పేలుళ్లతో టెహ్రాన్‌ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి
టెహ్రాన్‌ను తక్షణమే వీడండి: భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ


టెహ్రాన్‌: , 17 జూన్ (హి.స.)ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న పేలుళ్లతో టెహ్రాన్‌ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది.

‘‘టెహ్రాన్‌లోని భారతీయులు, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడండి. టెహ్రాన్‌ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్‌ అవ్వండి. మీరు ఉంటున్న లొకేషన్లు, మొబైల్‌ నంబర్లను వారితో పంచుకోండి’’ అని ఇరాన్‌లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది.

టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. నేరుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande