బ్రిటన్‌లో యోగాకు విస్తృత ప్రజాదరణ: కింగ్ ఛార్లెస్‌
హైదరాబాద్, 21 జూన్ (హి.స.) 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లండన్ లో భారత హై కమిషన్ ఆధ్వర్యంలో యోగా డే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ ప్రత్
బ్రిటన్ రాజు


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లండన్ లో భారత హై కమిషన్ ఆధ్వర్యంలో యోగా డే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ ప్రత్యేక సందేశం పంపించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్లో ప్రజలు పెద్దఎత్తున యోగాను స్వీకరించడం హర్షణీయం అని తెలిపారు. యోగా భారతదేశం నుంచి పుట్టినప్పటికీ, అది ఇప్పుడు ప్రపంచ ప్రజల ఆరోగ్య సాధనగా మారిందని కొనియాడారు.

ఈ సంవత్సరం యోగా దినోత్సవానికి 'Yoga for One Earth, One Health' అనే థీమ్ని ఎంచుకున్నారు. దీనిపై కింగ్ ఛార్లెస్ స్పందిస్తూ.. ప్రస్తుత, భవిష్యత్ తరాల కోసం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును భద్రపరచడానికి ప్రపంచం ఏకం కావడం ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తుందన్నారు. భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యోగా వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాక, సమాజం మొత్తానికి శాంతి, స్థిరత్వాన్ని అందించగలదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

లండన్లోని భారత హై కమిషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది యోగా అభిమానులు పాల్గొన్నారు. యోగా గురువులు వివిధ ఆసనాలను ప్రదర్శించగా, ప్రజలు వాటిని అనుసరించారు. యోగా ప్రాముఖ్యత, ప్రాచీన భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కార్యక్రమం సాగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande