
ఢిల్లీ, 22 జూన్ (హి.స.) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. పార్టీ ప్రాథమిక సభ్యుల సంఖ్య 14 కోట్లు దాటినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రకటించారు. ఈ ఘనత సాధించడం వెనుక బూత్ స్థాయి కార్యకర్తల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు.
ఈ విషయంపై బీఎల్ సంతోష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం 14 కోట్ల మార్కును దాటింది. ఇది గొప్ప విజయం. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త కృషి అమోఘం. మేము భారీ ప్రచార కార్యక్రమాలను నిలిపివేసినప్పటికీ, బూత్ స్థాయి కార్యకలాపాల ద్వారా 14 కోట్ల సభ్యత్వ మార్కును దాటగలిగాం, అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి