బనకచర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన
అమరావతి, 25 జూన్ (హి.స.) పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత చర్చ జరిగింది. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, వ
బనకచర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన


అమరావతి, 25 జూన్ (హి.స.) పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత చర్చ జరిగింది. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, వాటిలో కొన్నింటికి అనుమతులు లేకున్నా తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమావేశంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు ఇచ్చిందని, అదేవిధంగా గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కూడా అనుమతి లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ ప్రాజెక్టు వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకపోయినా, తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇది సున్నితమైన అంశం కాబట్టి, తెలంగాణతో ఘర్షణాత్మక వైఖరిని విడనాడి చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande