అమరావతి, 25 జూన్ (హి.స.)
హైదరాబాద్: మియాపూర్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం రేపింది. మానసిక రుగ్మతలు, ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అనిల్ అమిత్ చౌడ (30).. మియాపూర్‌లోని హఫీజ్‌పేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవలే అతడికి ఓ యువతితో నిశ్చితార్థం జరగ్గా.. నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, మంగళవారం రాత్రి గదిలోకి వెళ్లిన అనిల్.. ఎంత సేపటికీ తలుపులు తెరవకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ