తెలంగాణ, ఖమ్మం. 25 జూన్ (హి.స.)
ఖమ్మంలో లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న అన్నవరపు అంజిరెడ్డి అనే వ్యక్తిని ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా స్థానిక పంపింగ్ వెల్ రోడ్డులో అంజిరెడ్డి తన ఇంట్లో లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయమై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా వేసి బుధవారం దాడి చేసి పట్టుకున్నారు.
నిందితుడు అంజిరెడ్డి నుంచి స్కానింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖమ్మం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. నిందిత్యునిపై పిఎన్డీటీ 1994 చట్ట ప్రకారం పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు