మహబూబా జిల్లాలో కార్డన్ సెర్చ్: గుడుంబా, గుట్కా స్వాధీనం
మహబూబాబాద్, 25 జూన్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశానుసారం డీఎస్పీ తిరుపతి రావు, సీఐ రవికుమార్ సూచనల మేరకు బుధవారం వేకువజామున బయ్యారం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చట్ట విరుద్ధంగా వి
కార్డెన్ సెర్చ్


మహబూబాబాద్, 25 జూన్ (హి.స.)

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్

రాంనాథ్ కేకన్ ఆదేశానుసారం డీఎస్పీ తిరుపతి రావు, సీఐ రవికుమార్ సూచనల మేరకు బుధవారం వేకువజామున బయ్యారం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్న 7000 రూపాయలు విలువ గల లిక్కరు, 5000 రూపాయల విలువ గల గుట్కా పాకెట్స్, 10 లీటర్లు గుడుంబా, 500 లీటర్లు బెల్లం పానకం స్వాధీనం చేసుకుని నలుగురి పైన కేసు నమోదు చేసినట్టు వారు తెలిపారు. సరైన పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారన్నారు. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించి ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి, గుట్కా, గేమింగ్, నల్లబెల్లం, గుడుంబా తయారి పై దూరంగా ఉండాలని స్తానికులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande