తిరుమల , 25 జూన్ (హి.స.)కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రతి నెలా వివిధ రకాల విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా జులై నెలలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా జులై మాసంలో విశేష ఉత్సవాలు జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో జులై మాసంలో జరగబోయే విశేష ఉత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. జులై నెలలో 5వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకూ తొమ్మిది రకాల విశేష ఉత్సవాలు జరగనున్నాయి.
**జులై నెలలో జరగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి.**
* జులై 5న పెరియాళ్వార్ శాత్తుమొర
* జులై 6న శయన ఏకాదశి, చాతుర్మాస వ్రతారంభం
* జులై 7న శ్రీనాథ మునుల వర్షతిరునక్షత్రం
* జులై 10న గురు పౌర్ణమి గరుడసేవ
* జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం
* జులై 25న తిరుమల చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
* జులై 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు
* జులై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ
* జులై 30న కల్కి జయంతి, కశ్యపు మహర్షి జయంతి
ఈ శ్రీవారి విశేష ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి