నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన నాగర్కర్నూల్ కలెక్టర్
నాగర్ కర్నూల్, 3 జూన్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 3 జూన్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సంతోష్.. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో ఎంపిక చేయనున్న లబ్దిదారుల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande