వాటర్ షెడ్ త్వరితగతిన పూర్తి చేయాలి : సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్
సూర్యాపేట, 3 జూన్ (హి.స.) వాటర్ షెడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధకారులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోవాటర్ షెడ్ పథకం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. గ్రామ
సూర్యాపేట కలెక్టర్


సూర్యాపేట, 3 జూన్ (హి.స.)

వాటర్ షెడ్ పనులు త్వరితగతిన

పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధకారులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోవాటర్ షెడ్ పథకం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. గ్రామంలో వాటర్ షెడ్ పథకం కింద నాలుగు ఊట కుంటల నిర్మాణం, అలాగే ఒక చెక్ డ్యాం పనులు పూర్తి అయినట్లు, ప్రస్తుతం 25 రాక్ ఫీల్డ్ డ్యాములు, 10 విడిరాళ్ల కట్టల పనులు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ గ్రామంలో సహజ వనరుల యాజమాన్య కార్యక్రమం క్రింద రూ.61 లక్షలు కేటాయించగా ఇప్పటివరకు రూ.18.61 లక్షల విలువ గల పనులు పూర్తయినట్లు, మిగిలిన పనులు వివిద దశలో పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande