నెల్లూరు లో .ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి. క్యాంటీన్ల కుప్రజల ఆదరణ
నెల్లూరు 4 జూన్ (హి.స.) ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్‌కు ప్రజల నుంచి ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో ఆరు క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి కోసం ప్రభుత్వం అమలు
నెల్లూరు లో .ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి. క్యాంటీన్ల కుప్రజల ఆదరణ


నెల్లూరు 4 జూన్ (హి.స.) ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్‌కు ప్రజల నుంచి ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో ఆరు క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక వినూత్న కార్యక్రమాల్లో తృప్తి క్యాంటీన్‌ ఒకటి. బ్యాంకుల నుంచి సంఘాలకు పెట్టుబడి నిధి కింద రుణాలు అందించి వాటితో క్యాంటీన్లు ప్రారంభించాలన్నది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రణాళిక.

గత నెల 5న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరులో మొదటి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇది విజయవంతంగా నడుస్తుండడంతో రెండో విడతలో విశాఖలో 4, విజయవాడలో 2 క్యాంటీన్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంటెయినర్ల సమీకరణ, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో క్యాంటీన్‌ ఏర్పాటుకు రూ.13.50 లక్షలు అవసరం అవుతుందని అంచనా. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. స్థలానికి లీజు, అద్దె చెల్లించాల్సిన పని లేదు. విద్యుత్తు సరఫరా కూడా ఉచితం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande