అమరావతి, 4 జూన్ (హి.స.)వైసీపీ అధినేత జగన్ తెనాలి పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. కేసులున్నంత మాత్రాన రోడ్డుమీదే కొడతారా..? అమాయకులను రౌడీషీటర్లుగా చిత్రీకరిస్తారా…? అంటూ వైసీపీ ఆగ్రహావేశాలు వెల్లగక్కుతుంటే.. రౌడీలున్న పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఎటాక్‌కి దిగారు కూటమి నేతలు. కేసులుంటే రోడ్లపైనే కర్రలతో కొడతారా..? చంద్రబాబుపైనా 24 కేసులున్నాయ్.. ఆయన విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తారా ?అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. దళితులను కొట్టి రౌడీషీటర్లుగా ముద్రవేస్తున్నారంటూ ఫైర్ అయ్యారాయన. ప్రభుత్వ పద్దతి అసలేం బాలేదన్నారు.
ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమాయకులను కొడితే ఏమొస్తుందన్నారు..? గుర్తుపెట్టుకోండి లెక్కకు లెక్క తేలుస్తామంటూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి