అమరావతి, 4 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సక్సెస్ మంత్రాను ఉపయోగించుకుంటుంది. అలాగే తమిళనాడులో పార్టీ ఏర్పాటు పై ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల ఏ చిన్న కార్యక్రమం ఉన్నా స్వయంగా వెళ్లి పాల్గొంటున్నారు. అలాగే స్థానిక నేతలతో కలిసి మెలిసి ఉంటూ.. ఎన్డీయే పార్టీ నేతలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా.. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై తో పవన్ మంచి రాపో కొనసాగిస్తూ.. స్నేహాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ రోజు అన్నమలై పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు చెబుతూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ ఇలా రాసుకొచ్చాడు. విశిష్ట IPS అధికారి నుండి చైతన్యవంతమైన రాజకీయ నాయకుడిగా మీరు మారడం నిజంగా ప్రశంసనీయం. మీ రాజకీయ ప్రయాణం ప్రారంభం నుండి 'ఎన్ మన్, ఎన్ మక్కల్' యాత్రను ప్రారంభించినప్పటి నుంచి, మీరు రాష్ట్ర ప్రజలతో లోతుగా మమేకం కావడం ద్వారా తమిళనాడు రాజకీయ దృశ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. విధి, జాతీయతలో పాతుకుపోయిన మీ నిబద్ధత మీ బలమైన అంకితభావాన్ని చూపిస్తుంది. మీరు ధైర్యంతో దేశానికి సేవ చేస్తూనే, మీకు బలం, ఆరోగ్యం, నిరంతర విజయం లభించుగాక అని రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి