వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కలకలం..
హైదరాబాద్, 9 జూన్ (హి.స.) వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్న పాలడుగు నారాయణను వనస్థలిపురంలోని సరస్వతి నగర్ నుంచి సోమవారం ఉదయం గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చ
అడ్వకేట్ కిడ్నాప్


హైదరాబాద్, 9 జూన్ (హి.స.)

వనస్థలిపురం పోలీస్

స్టేషన్ పరిధిలో ఓ అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్న పాలడుగు నారాయణను వనస్థలిపురంలోని సరస్వతి నగర్ నుంచి సోమవారం ఉదయం గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారు. నారాయణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నారాయణ మొబైల్ లొకేషన్, సీసీ పుటేజీల ఆధారంగా 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. కుత్భుల్లాపూర్లోని ఓ భూ వివాదమే అడ్వకేట్ కిడ్నాప్ కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా నారాయణకు, స్థానిక వ్యక్తులకు కుత్బుల్లాపూర్లోని ఓ భూ వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అలా అయితే కిడ్నాప్ చేసిన దుండగులు భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఎందుకు డిమాండ్ చేశారు ? కిడ్నాప్ కు భూవివాదమే కారణమా ? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే విషయం పై స్పష్టతతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande