ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన ఏపీ పోలీసులు..
హైదరాబాద్, 9 జూన్ (హి.స.) ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కొమ్మినేనిని ఏపీకి తరలించారు. ఏపీ రాజధాని అ
సీనియర్ జర్నలిస్ట్


హైదరాబాద్, 9 జూన్ (హి.స.) ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కొమ్మినేనిని ఏపీకి తరలించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిసింది.

ఇవాళ ఉదయం ఏపీ పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి మఫ్టీలో వెళ్లారు. ఈ సందర్భంగా ముందస్తు నోటీసులు, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంటికి వచ్చారని కొమ్మినేని ప్రశ్నించగా.. ఎన్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. కేసు ఏంటని అడిగితే మాత్రం పోలీసులు సమాధానమివ్వలేదు. అలాగే ఆయన్ను అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 79, 196(1), 353(2), 299, 356(2), 31(1), 252 67, ఐటీఏ 3(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande